Telugu Gateway
Andhra Pradesh

నవయుగా కేసు..తీర్పు రిజర్వు

నవయుగా కేసు..తీర్పు రిజర్వు
X

పోలవరం ప్రాజెక్టు భవితవ్యం తేల్చే అంశానికి సంబంధించి నవయుగా దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. పోలవరం జల విద్యుత్ కేంద్రం ఒప్పందం రద్దు విషయంలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిందని..తమనే కొనసాగించేలా ఆదేశించాలని కోరుతూ నవయుగా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఏపీ సర్కారు రివర్స్ టెండర్ విధానంపై నవయుగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ ఆగస్టు 14న ఏపీ జెన్ కో చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగా కోర్టును అభ్యర్ధించింది. ఈ మేరకు నవయుగా డైరక్టర్ వై. రమేష్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఒప్పందంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని..ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయిస్తే పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

2021 నవంబర్ వరకూ తమకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉందని పేర్కొంది. ఇప్పటికే తాము ఈ ప్రాజెక్టుపై కోట్లాది రూపాయల వ్యయం చేశామని తెలిపారు. నోటీసుకు సమాధానం ఇచ్చినా కూడా సర్కారు ఏకపక్షంగా ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు విన్పించారు. ఇఫ్పటి వరకూ కంపెనీ పనుల్లో ఎలాంటి పురోగతి చూపించలేదని తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్, విద్యుత్ ప్రాజెక్టు పనులకు కలపి ఒకే టెండర్ పిలవటంతో ఈ తీర్పు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ కు ముడిపడి ఉన్నట్లు అయింది.

Next Story
Share it