Telugu Gateway
Cinema

‘ఉత్తమ నటి’గా మహానటి కీర్తిసురేష్

‘ఉత్తమ నటి’గా మహానటి కీర్తిసురేష్
X

నిజంగానే కీర్తిసురేష్ ఒక్క సినిమాతోనే ‘మహానటి’ అన్న పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ కు చెందిన సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డుతోపాటు..మహానటి సినిమాకు కూడా జాతీయ అవార్డు దక్కింది. 66వ జాతీయ అవార్డులను శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. సాం​కేతిక విభాగాల్లో కూడా ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంథాధున్‌ ఎంపికైంది. పద్మావత్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.

జాతీయ పురస్కారాలు

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య దర్‌(ఉడి)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి

ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌

బెస్ట్‌ మేకప్‌, విజువల్‌, స్పెషల్‌ ఎఫెక్ట్‌: అ!

ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ

ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌

ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌

ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌

ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌

ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ)

Next Story
Share it