Telugu Gateway
Cinema

‘సాహో’పై నాని కామెంట్స్

‘సాహో’పై నాని కామెంట్స్
X

ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు పలు ఇతర భాషల్లో ‘సాహో’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమాకు అంత హైప్ క్రియేట్ అయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావటంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. ఈ సినిమాపై న్యాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సాహో’ మన సినిమా.. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి.

ప్రభాస్‌ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్‌ రిలీజ్‌ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సాహో రిలీజ్ డేట్‌ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్‌లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు.

Next Story
Share it