కంటతడిపెట్టిన మోడీ

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఆకస్మిక మృతి దేశ ప్రజలను కలచివేసింది. ఆమె వార్త బుధవారం ఉదయమే చాలా మందిని షాక్ కు గురిచేసింది. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉన్నా ఆయన కంటి వెంట నీరు ఆగలేదు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, సోనియా గాంధీలు సుష్మా స్వరాజ్ ఇంటికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సుష్మా స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. రాజ్యసభ సుష్మా స్వరాజ్ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.50 గంటల సమయంలో సుష్మా స్వరాజ్ మృతి చెందిన సంగతి తెలిసిందే.