Telugu Gateway
Top Stories

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు
X

కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పలు బ్యాంకుల విలీనాలను ప్రకటించింది. అదే సమయంలో 250 కోట్ల రూపాయల పైబడిన రుణాలు అన్నింటిపై పర్యవేక్షణకు ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో భవిష్యత్ లోఇక నీరవ్ మోడీ లాంటి ఉదంతాలు జరక్కుండా చూస్తామని దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆమె శుక్రవారం నాడు డిల్లీలో మీడియాలో మాట్లాడుతూ బ్యాంకుల విలీనాలపై ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12 తగ్గిపోనున్నాయి. బ్యాంకుల రీకాపిటలైజేషన్ ద్వారా పలు బ్యాంకులు ఇప్పటికే రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు.

మొత్తం 10 బ్యాంకులను కలిపి 4 కొత్త అతిపెద్ద బ్యాంకులుగా రూపాంతరం చెందనున్నాయని వెల్లడించారు. అయితే ఈ విలీనం ప్రభావంతో ఎలాంటి తొలగింపులు ఉండవని స్పష్టం చేశారు. నియమాక ప్రమాణాలను, పద్ధతుల్లో కూడా సంస్కరణ తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల బోర్డులను బలోపేతం చేస్తామని, అలాగే బోర్డు సైజ్‌ను నిర్ణయించే అధికారం బ్యాంకులకే ఉంటుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రతిబ్యాంకులో స్పెషల్‌ రిస్క్‌ ఆఫీసర్లను నియమిస్తామనీ, అయితే వీరికి జీతాలు ప్రభుత్వం చెల్లించదని చెప్పారు. బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీని వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

బ్యాంకుల విలీనం ఇలా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, (పీఎన్‌బీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా 11437 బ్రాంచిలతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విలీన బ్యాంకు అవతరించనుంది.

ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది.

Next Story
Share it