మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత తొలగింపు
BY Telugu Gateway26 Aug 2019 5:15 AM GMT

X
Telugu Gateway26 Aug 2019 5:15 AM GMT
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కొనసాగనుంది. హోం శాఖకు చెందిన కమిటీ ఎస్పీజీ భద్రతపై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు మాత్రమే ఎస్పీజీ భద్రత పొందుతున్న వారిలో ఉన్నారు.
వేలాది మంది సిబ్బందితో కూడిన ఎస్‌పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్న ముప్పు ఆధారంగా ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు. మన్మోహన్ సింగ్ ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Next Story