Telugu Gateway
Andhra Pradesh

ప్రకాశం బ్యారెజ్ గేట్లు ఎత్తేశారు

ప్రకాశం బ్యారెజ్ గేట్లు ఎత్తేశారు
X

ఫస్ట్ శ్రీశైలం. తర్వాత నాగార్జున సాగర్. ఇప్పుడు కృష్ణా బ్యారెజ్. ప్రధాన రిజర్వాయర్లు అన్నంటిలోకి నీరు పుష్కలంగా చేరుతుండటంతో వరస పెట్టి గేట్లు తెరుచుకుంటూ పోతున్నారు. దీంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో తొలుత రుతుపవనాలు చాలా రోజులు మొహం చాటేశాయి. తర్వాత వర్షాలు ప్రారంభం అయినా..ఎగువన కురుస్తున్న వర్షాలతోనే రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల్లోకి భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ఎన్నో సంవత్సరాల తర్వాత విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తారు. కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదలిపెట్టారు. బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు.

బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. దిగువ లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీకి 1998, 2000 సంవత్సరాల్లో భారీ వరద వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. తిరిగి ఇప్పుడు వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది.

Next Story
Share it