Telugu Gateway
Cinema

‘సంపూ’ సంపేస్తున్నాడు

‘సంపూ’ సంపేస్తున్నాడు
X

సంపూర్ణేష్ బాబు సంపేస్తున్నాడు. ఓ వైపు కొబ్బరిమట్ట సినిమాతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే సినీ పరిశ్రమలోని డాబులను ఎండగడుతున్నాడు. దొరికిన ఏ ఛాన్స్ ను వదులుకోకుండా పరిశ్రమలో ఉన్న అబద్దపు ప్రచారాలపై అస్త్రాలు సంధిస్తున్నాడు. సినిమా విడుదలకు ముందే కొబ్బరిమట్ల కలెక్షన్లు 258 కోట్లకు చేరే అవకాశం ఉందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.

మూడు రోజుల్లో 12 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అభిమానుల కోసం తొమ్మిది కోట్ల రూపాయల ఫేక్ కలెక్షన్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అంటే నికరంగా కొబ్బరిమట్ట సినిమా 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చిచెప్పారు. అయితే మన్మథుడు2 సినిమా ఫట్ మనటం కూడా సంపూర్ణేష్ బాబుకు కలిసొచ్చిందని అంటున్నారు. సంపూ సినిమా భారీ పోటి మధ్య మూడు కోట్ల వసూళ్లు సాధిచటం కూడా ఘనవిజయమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.

Next Story
Share it