Telugu Gateway
Andhra Pradesh

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
X

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచి తరలిపోనుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఆయన తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. అదేంటో చూడండి.

‘జగన్ రెడ్డి గారు @ysjagan చిన్నపుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాం. 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్ర లోని దౌలతాబాద్కు తిరిగి అక్కడి నుండి ఢిల్లీ కి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it