Telugu Gateway
Telangana

ఆ స్కీమ్ కు ‘చింతమడక’ పేరు పెట్టుకున్నా ఓకే...కానీ!

ఆ స్కీమ్ కు ‘చింతమడక’ పేరు పెట్టుకున్నా ఓకే...కానీ!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక్క చింతమడక గ్రామంలోని ప్రజలకే కాకుండా..రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల సాయం చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కావాలనుకుంటే కెసీఆర్ ఈ పథకానికి ‘చింతమడక’ పథకం అని పేరు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక చింతమడక గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసి.. కులం,ఆదాయం తో సంబందం లేకుండా కుటుంబానికి పది లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం.. చింతమడక లాగే తెలంగాణ లోని అన్ని కుటుంబాలకు పది లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అందరిని సమానంగా చూడవలసిన ముఖ్యమంత్రి గా ఒక చింతమడక గ్రామానికే సహాయం చేస్తే మిగతా ప్రజలకు అన్యాయం చేసినవారవుతారు. రాష్ట్ర ప్రజలందరికీ పది లక్షల చొప్పున పంపిణీ చేయాలని కోరుతున్నా. ఈ విషయమై సీఎం కు లేఖ రాస్తున్నా. రాష్ట్రంలో పది లక్షలు పొందే అర్హత కలిగిఉన్న ప్రజలంధరినీ సమాయత్తం చేస్తాం. అది కేసీఆర్ ఫాంహౌస్ డబ్బు కాదు రాష్ట్ర ఖజానాది..పౌరులందరూ ఈ డబ్బు పొందే హక్కు ఉంది.

మీడియా సంస్థ ల ఎడిటర్ లను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తామనడాన్ని మేము స్వాగతిస్తూనే...ఈ ప్రాజెక్టు డీపిఆర్ ,కాంట్రాక్టు వ్యవహారాలు ఎడిటర్ లకు ఇవ్వాలని కోరుతున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు డీపిఆర్ ను అసెంబ్లీ సభ్యులందరికీ ఇస్తామని గతంలో అసెంబ్లీ లో సీఎం చెప్పారు..కానీ ఇప్పటి వరకు కాపీ లు ఇవ్వలేదు.. ఇప్పటికైనా ఇవ్వాలని కోరుతున్నా....గతంలో ఏ సీఎం అయినా వాళ్ళ సొంత గ్రామానికో ,మండలానికో స్కూల్ ,కాలేజ్ , నీటిపారుదల ప్రాజెక్టు ఇలాంటి పనులు చేసేవారు.. ఇలా ఇంటికి పది లక్షలు ఎప్పుడు ఇవ్వలేదు. బీజేపీ ఉనికి ఉందని చెప్పుకోవడం కోసం మాత్రమే లక్ష్మణ్ కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.’ అని విమర్శించారు.

Next Story
Share it