Telugu Gateway
Telangana

కెసీఆర్ గిఫ్ట్ లూ కాస్ట్లీనే.!

కెసీఆర్ గిఫ్ట్ లూ కాస్ట్లీనే.!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏది చేసినా రిచ్ గానే ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున ఓ క్యాంప్ ఆఫీస్..సీఎం అధికార నివాసం ఉండగానే అవి నాకొద్దు అని వందల కోట్ల రూపాయల వ్యయంతో ‘ప్రగతి భవన్ ’ ఫేరుతో కొత్త భవనాలు కట్టించారు. ఇప్పుడు సచివాలయం, అసెంబ్లీ విషయంలోనూ అదే సాగుతోంది. ఇదంతా ఒకెత్తు అయితే కెసీఆర్ గిఫ్ట్ లు ఇవ్వటంలోనూ తాను ఏ మాత్రం రాజీపడనని.. అందులోనూ కాస్ట్లీగానే ఉంటానని నిరూపించుకున్నారు. సహజంగా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారికి జ్ణాపికలు ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా వచ్చే వారు సహజంగానే వివిఐపిలు ఉంటారు కాబట్టి వారికి ఇచ్చే కానుకలు కూడా ఖరీదైనవే ఉంటాయి.

కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫఢ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు తెలంగాణ సీఎం కెసీఆర్ వెండి వీణలను బహుకరించారు. వీటి కోసం కిలోల కొద్ది వెండిని ఉపయోగించారు. వీటితోపాటు మరికొన్ని మెమెంటోలకు సర్కారు ఏకంగా 1.66 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ జీవో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ వైపు తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉంటే వీటి అన్నింటిని వదిలేసి బహుమతులు అందజేయటానికి కోట్ల రూపాయం వ్యయం చేస్తారా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

Next Story
Share it