Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న ‘జోడీ’ ట్రైలర్

ఆకట్టుకుంటున్న ‘జోడీ’ ట్రైలర్
X

‘బుర్రకథ’ సినిమాపై ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద అది పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు జోడీ అంటూ కొత్త సినిమాతో ముందుకొచ్చేందుకు రెడీ అయిపోయాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాలో ఆది సాయికుమార్ కు జోడీగా జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ సినిమా ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా కన్పిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ ఇదే విషయాన్ని చెబుతోంది.

విశ్వనాథ్‌ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్‌ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్‌ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్‌, సీనియర్‌ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?time_continue=2&v=PFHnoKEejbk

Next Story
Share it