గోవా క్యాసినోలో జగపతిబాబు
BY Telugu Gateway4 Aug 2019 12:04 PM IST

X
Telugu Gateway4 Aug 2019 12:04 PM IST
టాలీవుడ్ లో ఏ విషయాన్ని అయినా నిర్మోహమాటంగా చెప్పేవారిలో జగపతిబాబు ముందు వరసలో ఉంటారు. తనకు అలవాట్లు..తాను చేసిన పొరపాట్లు కూడా నిర్మోహమాటంగా వెలిబుచ్చుతారు. తనకు క్యాసినోల్లో ఎంజాయ్ చేయటం ఎంతో ఇష్టం అని...అందులో కూడా కొంత డబ్బు పొగొట్టుకున్నట్లు కొద్ది కాలం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
ఇప్పుడు ఆయన తనకిష్టమైన పని చేస్తున్నారు. గోవాలోని బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోను ట్విట్టర్ లో షేరు చేసుకున్నారు. అంతే కాదు...‘నేను గోవా, బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను విష్ చేయండి’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం జగపతిబాబు టాలీవుడ్ లో పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు.
Next Story