ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్..టైర్లలో మంటలు
BY Telugu Gateway27 Aug 2019 7:06 PM IST
X
Telugu Gateway27 Aug 2019 7:06 PM IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో టైర్లలో మంటలు వచ్చాయి. విషయం గ్రహించిన పైలట్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రమాదం తృటిలో తప్పినట్లు అయింది.
టైర్లలో మంటలు రావటంతో ఎయిర్‌పోర్ట్ అధికారులకు పైలట్ సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారులు తగు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలోని 155 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
Next Story