Telugu Gateway
Andhra Pradesh

ఇది ప్రభుత్వ ఉగ్రవాదం..జగన్ సర్కారుపై పాయ్ ఫైర్

ఇది ప్రభుత్వ ఉగ్రవాదం..జగన్ సర్కారుపై పాయ్ ఫైర్
X

పీపీపీల సమీక్ష. కాంట్రాక్ట్ ఒప్పందాల రద్దు. ఇవన్నీ ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారును దేశ వ్యాప్తంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎల్ అండ్ టి వంటి ప్రముఖ సంస్థ కూడా జగన్ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ డైరక్టర్ టీ వీ మోహన్ దాస్ చేసిన ట్విట్టర్ వేదిక చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో ఇప్పుడు సర్కారీ ఉగ్రవాదం నడుస్తుంది అంటూ ట్వీట్ చేయటం కలకలం రేపుతోంది. తాజాగా పన్ను అధికారుల తీరును తప్పుపడుతూ కూడా ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇప్పుడు జగన్ సర్కారుపై పాయ్ స్పందించటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి మరింత నష్టం జరుగుతుందనే అభిప్రాయం కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌ ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోహన్‌దాస్‌ పా య్‌ విమర్శించారు. అమరావ తి పనుల నిలిపివేత, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) పై పునఃసమీక్షవంటి నిర్ణయాలను ‘ప్రభుత్వ ఉగ్రవాదం’తో పోల్చారు.

సౌర, పవన పీపీఏ ల పునఃసమీక్షపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జపాన్‌ రాసిన లేఖపై ప్రచురితమైన వార్తల ను ట్వీట్‌ చేస్తూ పెట్టుబడులు పెట్టిన విదే శీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశారు. ప్రభుత్వ ఒప్పందాల ను తిరగదోడుతూ, వ్యాపారులను బెదరగొడుతుంటే ఎవరై నా పెట్టుబడులు పెడతారా? అమరావతిలో సింగపూర్‌ భారీ గా పెట్టుబడులు పెట్టింది. కానీ, ఆ ఒప్పందాన్ని ఏపీ సర్కా రు తిరగదోడుతోంది. ఇక.. ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా?’’ అని పాయ్‌ తన ట్వీట్లలో ప్రశ్నించారు. వీటిని నేరుగా జగన్‌ ట్విట్టర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు. బెంగళూరుకు చెందిన పాయ్‌ పద్మశ్రీ అవార్డు గ్రహిత. పలు వ్యాపార సంస్థల్లో పనిచేశారు. బెస్ట్‌ సీఎ్‌ఫ్ వో అవార్డు కూడా అందుకున్నారు.

Next Story
Share it