Telugu Gateway
Telangana

చంద్రబాబు తెలంగాణలో పార్టీని వదిలేశారు

చంద్రబాబు తెలంగాణలో పార్టీని వదిలేశారు
X

రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరిక సందర్భంగా తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తెలంగాణలో పార్టీని పూర్తిగా వదిలేశారన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి కూడా కనీసం టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. బిజెపిలో చేరిక సందర్భంగా గరికపాటి వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘కొత్తగూడెం వరంగల్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తుంటే అడుగడునా పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్న ఈ ప్రభంజనం ఆగదు. తెలుగుదేశం లో అనేక పదవులు అనుభవించాను. ఎన్నో ఏళ్లుగా టీడీపీ కి పని చేశాం. కష్టకాలం లో తెలంగాణ టీడీపీ నేతలు ఆదుకున్నారు. చంద్రబాబు వెంట పార్టీ కోసం కష్టపడ్డాం. బాబ్లీ కోసం ఎంతమంది వీపులు పగిలాయో మీ అందరికీ తెలుసు. ఏపీ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక...చంద్రబాబు బీజీ అయిపోయారు. కానీ తెలంగాణ టీడీపీ ఏ విధంగా పనిచేసిందో మీకు తెలుసు.

అసలు టీ టీడీపీ ని ఉంచాలా తీసేయాలా అనే పరిస్థితి వచ్చింది. అనేక సార్లు చంద్రబాబు దృష్టికి తీసుకుళ్ళెనా అక్కడ ఆయన బీజీ గా ఉండడం వల్ల దృష్టి సారించలేకపోయారు. పార్టీ కోసం పనిచేసిన వారి కి టిక్కెట్ నిరాకరించింది టీ టీడీపీ. పార్టీ పని కోసం పనికి వచ్చిన నేతలు పోటీ కి పనికిరారా అని అప్పుడే ప్రశ్నించా. తెలంగాణ లో టీడీపీ కి బలం ఉన్నా పోటీ కి నిలబెట్టలేదు. ఏపీ లో తెలుగు దేశం భాగుండాలని కోరుకుంటుంన్నా. చంద్రబాబు ను నిందించదలుచుకోలేదు. పదవుల కోసం కాదు , బీజేపీ గెలుపు కోసం బీజేపీ లో చేరుతున్నాం. టీడీపీ లో నష్టపోయిన నేతలకు బీజేపీ లో న్యాయం చేస్తా.’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గరికపాటి భావోద్వేగం తో కంట తడిపెట్టుకున్నారు.బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె పీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు.

Next Story
Share it