రైలులో మంటలు..కాలిన రెండు బోగీలు
BY Telugu Gateway29 Aug 2019 10:25 AM IST

X
Telugu Gateway29 Aug 2019 10:25 AM IST
తెలంగాణ ఎక్స్ ప్రెస్. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళుతోంది. సడన్ గా రైలులో మంటలు. ఏకంగా రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ ప్రమాదం బారిన పడకుండా తప్పించుకోగలిగారు. దీంతో అందరూ ఊఫిరిపీల్చుకున్నారు. తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన బోగీలను రైలు నుంచి విడగొట్టారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో గురువారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
ఫరిదాబాద్ జిల్లా భాగల్ఘాట్ వద్ద గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఏసీ బోగీలో షార్ట్ సర్య్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ముందుగా B-1 బోగీలో చెలరేగిన మంటలు ప్యాంట్రీ, ఆ తర్వాత S-10 బోగీకి వ్యాపించినట్లు సమాచారం.
Next Story