Telugu Gateway
Telangana

బిజెపిలోకి మాజీ ఎంపీ వివేక్

బిజెపిలోకి మాజీ ఎంపీ వివేక్
X

బిజెపినా?. కాంగ్రెసా?. ఇలా ఊగిసలాడిన మాజీ ఎంపీ జి. వివేక్ క్లారిటీ తెచ్చేసుకున్నారు. కమలం గూటికే చేరాలని నిర్ణయించుకున్నారు. వివేక్ బిజెపిలో చేరటానికి ముందే నిర్ణయించుకున్నా..మధ్యలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన రాయభారంతో కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి.

అనుమానాలను పటాపంచలు చేస్తూ వివేక్ బిజెపి గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో మాజీ ఆయన శుక్రవారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు.

Next Story
Share it