Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు పాపమే..అమరావతికి శాపం!

చంద్రబాబు పాపమే..అమరావతికి శాపం!
X

ఏపీ రాజధాని అమరావతి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ఉంటుందా? లేక వేరే ప్రాంతానికి మారుతుందా? అన్న అంశంపై ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి కారణం మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలే. అయితే జగన్ సర్కారు తుది నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఏపీ ప్రజలు ఎవరినైనా నిందించాలి అంటే అది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే అని చెప్పకతప్పడు. గత ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి..సంవత్సరాలకు తరబడి డిజైన్లతో ప్రజలను మాయ చేయటం తప్ప అసలు నిర్మాణాలు చేపట్టలేదు.

అదే చంద్రబాబు హయాంలో తాను ప్రతిపాదించినట్లు కోర్ క్యాపిటల్ కు సంబంధించి శాశ్వత నిర్మాణాలను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు జగన్ సర్కారుకు రాజధాని మార్పు..తరలింపు వంటి ఆలోచన కూడా చేసి ఉండేది కాదు. జగన్ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ప్లాన్స్ అన్నీ యతాతధంగా అమలు చేయరనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలుగుదేశం నేతలతోపాలు పలువురు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ముందుగానే భూములు కొనుగోలు చేశారు. తాత్కాలిక సచివాలయం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులను ‘రికార్డు’ సమయంలో పూర్తి చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అదే పనిని శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు విషయంలో ఎందుకు చేయలేకపోయారు?.

కనీసం కొన్ని భవనాలు అయినా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా?. అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంతో మంది రాజధాని నిర్మాణాలు కొన్నింటిని అయినా ఎన్నికల నాటికి పూర్తి చేయాలని పదే పదే కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇఫ్పుడు మాత్రం టీడీపీ నేతలు నానా హంగామా చేస్తున్నారు. ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా రాజధానిని అమరావతి నుంచి మారిస్తే అందుకు చంద్రబాబు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Next Story
Share it