Telugu Gateway
Cinema

క్యాస్ట్ ఫీలింగ్ ఉండటం గర్వంగా పీలవుతా!

క్యాస్ట్ ఫీలింగ్ ఉండటం గర్వంగా పీలవుతా!
X

‘వందలాది కులాలు రాజ్యాంగబద్దంగా ఉన్న దేశంలో కులం అడిగిన వాడు గాడిద లాంటి హిపోక్రసి నిండిన కొటేషన్లను జనం మీద రుద్దే మీడియాలు ఉన్నప్పుడు..కులానిదేముంది అండీ..అంటూనే పలానా ప్రాంతంలో పలానా కులం వాళ్ళకు ఓట్లు ఎక్కువ కాబట్టి..పలానా కులం వాళ్ళకు సీటు ఇవ్వాలనే రాజకీయ దగుల్బాజీలు ఉన్నప్పుడు ..ప్రతిభకే పట్టం కట్టాలి అంటూనే పలానా కులంలో పుట్టాడు కాబట్టి అతనికి ప్రతిభ లేకపోయినా పర్వాలేదు అని సడలింపులు చేస్తున్నప్పుడు.

ఇలాంటి ఒకదానికొకటి సంబంధం లేని వ్యతిరేక మాటలు వినీ వినీ విసుగెత్తి..చిరాకు దొబ్బి క్యాస్ట్ మీదే సర్వం నడుస్తుంది అని నమ్మే రాష్ట్రంలో ముసుగులో గుద్దులాటలు ఆపి నా క్యాస్ట్ ఫీలింగ్ ను సగర్వంగా..బహిరంగంగా గొంతెత్తి అరిచి చాటుకోవాలనే ఉద్దేశంతోనే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో సందర్భానుసారం ఈ క్యాస్ట్ ఫీలింగ్ పాట పెట్టా’ అంటూ పాటకు ముందు రామ్ గోపాల్ వర్మ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన పాటను రామ్ గోపాల్ వర్మ మంగళవారం నాడు విడుదల చేసింది.

https://www.youtube.com/watch?v=g9nODSJiyLQ

Next Story
Share it