ఎన్టీఆర్ పై బాలయ్య అల్లుడి సంచలన వ్యాఖ్యలు
‘నా వరకూ అయితే ఆయన పార్టీకి అవసరం. ఆయన ఉంటేనే పార్టీ బాగుంటుంది అని నేను అనుకోను. నేను కాన్ఫిడెంట్ ఏంటి అంటే మాకున్న టాలెంట్..ఇప్పుడున్న యువ నాయకులతో కొత్త ఆలోచనలతో కొత్త స్ట్రక్చర్ చేయగలుగుతాం. మేమే బిల్డ్ చేసుకుంటాం. ఎన్టీఆర్ వచ్చినప్పుడు 175 మంది జూనియర్ ఎన్టీఆర్ లాంటి తెలిసిన వాళ్లు కాదు కదా?.’ ఇవీ గత ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ గా టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలైన భరత్ చేసిన వ్యాఖ్యలు. బాలకృష్ణ చిన్నల్లుడు అయిన ఈ భరత్ తాజాగా ఓ ఛానల్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏముంది?. అలా ఎందుకు కోరుకుంటాం.
ఇప్పుడు వరకూ నడిపిన పార్టీ. ఇప్పుడు మాకున్న నాయకులు పనికిరాని వాళ్ళు అంటే నో అంటాం’అని తెలిపారు. ఎన్టీఆర్ కు చాలా మంది పిల్లలు..చాలా మంది మనవళ్ళు..మనవరాళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఛరిష్మా ఉంది. ఫ్యాన్స్ ఉన్నారు. హీరోగా ఉన్నారు. దీన్ని ఎవరూ క్వశ్చన్ చేయటం లేదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది అని ఆయన ఎక్స్ ప్రెస్ చేసి..మా నాయకుడికి ఆయన పార్టీలోకి వస్తే..అవసరం ఉంటే బాగుంటుంది అన్పిస్తే డిఫనెట్ గా వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకుంటారు. నా వరకూ అయితే ఆయన పార్టీకి అవసరం.ఆయన ఉంటేనే పార్టీ బాగుంటుంది అని అయితే నేను అనుకోను’ అని వ్యాఖ్యానించారు భరత్. ఓ వైపు టీడీపీ అధినేత,, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో బాలకృష్ణ చిన్నల్లుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు.