అతి పెద్ద స్ర్కీన్ ను ప్రారంభించిన రామ్ చరణ్
BY Telugu Gateway29 Aug 2019 4:39 PM IST

X
Telugu Gateway29 Aug 2019 4:39 PM IST
నెల్లూరు దేశంలోనే ఓ ప్రత్యేకతను దక్కించుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా లేనటువంటి బిగ్ స్క్రీన్ ఇప్పుడు నెల్లూరులో ఏర్పాటు అయింది. 40 కోట్ల రూపాయల వ్యయంతో యూవీ క్రియేషన్స్ అధినేతలు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ స్క్రీన్ ను గురువారం నాడు హీరో రామ్ చరణ్ ప్రారంభించారు. ఇందులో తొలి సినిమాగా ‘సాహో’ ప్రదర్శితం కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద అడుగుల వెడల్పు..54 అడుగుల ఎత్తుతో ఈ భారీ స్క్రీన్ ఏర్పాటైంది.
ఇందులో ఏకంగా 656 సీట్లు ఉన్నాయి. త్రీడీ సౌండ్ సిస్టమ్ తో దీన్ని డెవలప్ చేశారు. ఇలాంటి స్క్రీన్లు ఆసియా ఖండంలోనే మరో రెండు మాత్రమే ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో మూడు సినిమా థియేటర్లను ఈ కాంప్లెక్స్ లో నిర్మించారు. మిగిలిన రెండు థియేటర్లు 180 సీట్లు కెపాసిటీతో నిర్మించారు.
Next Story



