Telugu Gateway
Politics

కాశ్మీర్ నిర్ణయంపై ఎవరెటు?

కాశ్మీర్ నిర్ణయంపై ఎవరెటు?
X

అత్యంత కీలకమైన కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంలో మోడీ సర్కారుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నా ప్రజల నుంచి మాత్రం విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలే దీనికి నిదర్శనం. పెద్ద ఎత్తున కేంద్ర నిర్ణయానికి మద్దతుగా ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొంత మంది మాత్రం కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే మోడీ సర్కారుకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, మూడు రాష్ట్రాలుగా చేసిన నిర్ణయానికి వైసీపీ, బిఎస్పీ, ఏఐఏడీఎంకె, బిజు జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

కేంద్ర నిర్ణయం చారిత్రక తప్పదం అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీతోపాటు పీడీపీ, డీఎంకె, ఎండీఎంకెలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టాయి. భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఖూనీ చేసిందని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ప్రతిపాదనను ఖండిస్తున్నట్లు తెలిపారు. తాము భారత రాజ్యంగం వైపు ఉన్నామని..ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన నిబంధనలకు బిజెపి తూట్లు పొడిచిందని ఆజాద్ ధ్వజమెత్తారు.

Next Story
Share it