Telugu Gateway
Politics

లోకేష్ పై రోజా ఫైర్

లోకేష్ పై రోజా ఫైర్
X

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేశ్‌కు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్‌లు యువతను మోసం చేశారని ఆరోపించారు. గురువారం జిల్లాలోని పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటగా తయారు చేసిన సెల్టోస్ మోడల్ కార్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనత అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా సీఎం వైఎస్‌ జగన్‌ చట్టం చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు.

Next Story
Share it