అల్లు అర్జున్ కొత్త కారు
సెలబ్రిటీలు ఏమి చేసినా అది వాళ్ళ అభిమానులకు పెద్ద వార్తే. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ కార్ వాన్ పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ కార్ వాన్ లో సౌకర్యాలు హల్ చల్ చేశాయి. ఇది చూసి ఆయన అభిమానులు ఫుల్ కుషీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ తాజాగా తాను కొన్న కొత్త కారును పోస్ట్ చేశారు. ‘ఇంట్లో కొత్త కారు. దీనికి నేను బీస్ట్ అని పేరు పెట్టాను. నేను ఏదైన కొన్న ప్రతిసారి నాకు కృతజ్ఞత భావనే కలుగుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.
అంతే అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురం సినిమాతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీ గా పూజా హెడ్డె నటిస్తోంది. ఆమెతో పాటు ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, టబు, జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.