చంద్రబాబు సర్కారునే ప్రపంచ బ్యాంకు నమ్మేలేదు
ఇవి ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు అన్నీ ప్రపంచ బ్యాంకు చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతిలోని పనులకు సంబంధించి ప్యాకేజీల్లో మార్పులపై ప్రపంచ బ్యాంక్ అభ్యంతరాలు కూడా తెలిపిందని బుగ్గన తెలిపారు. అమరావతికి భూములు ఇవ్వనందుకు పంటలను తగలపెట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ముందే మాట్లాడుకుని టెండర్లు పిలిచినట్లు స్పష్టంగా కనపడుతోందని తెలిపారు. సోమవారం నాడు అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు రుణం అంశంపై చర్చ జరిగింది. ప్రపంచ బ్యాంకు నిధులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని వివరించారు. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ‘‘అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఉంటుంది.