అమ్మాయి..అమ్మాయిని ముద్దు పెట్టుకోకూడదా!
ఇది హీరోయిన్ అమలాపాల్ ప్రశ్న. అమ్మాయి ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? అంటుంది ఈ భామ. ఆమె నటించిన చిత్రం ‘ఆమె’ ఈ నెల19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించి పెద్ద సంచలనం సృష్టించారు. కథ డిమాండ్ చేసింది కాబట్టే తాను ఆ పాత్రను చేశానని చెబుతోంది అమలాపాల్. ఆమె చిత్ర ట్రైలర్ లో అమలాపాల్ మరో నటి ఆర్ జె రమ్యను ముద్దు పెట్టుకున్న దృశ్యం కన్పిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారటంతో తాజాగా అమలాపాల్ ను విలేకరులు ఈ అంశంపై ప్రశ్న అడిగారు.
దీనిపై స్పందించిన ఆమె అది అనుకోకుండా వచ్చిందని..ఇది స్క్రిప్టులో లేదని పేర్కొంది. సినిమా చూస్తే తప్ప అసలు విషయం తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో తన నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి చెప్పానని..కథ డిమాండ్ చేస్తే అందుకు అభ్యంతరం లేదని తనకు మద్దతు తెలిపారని చెప్పారు అమలాపాల్. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆమె సినిమా విడుదల తర్వాత ఎంత సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.