అండర్ సీ రెస్టారెంట్ అనుభవం కోరుెకుంటున్నారా?
BY Telugu Gateway28 July 2019 9:00 AM GMT
X
Telugu Gateway28 July 2019 9:00 AM GMT
సముద్ర ప్రయాణమే ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అలాంటిది సముద్రం కింద ఓ హోటల్ లో కూర్చుని డిన్నర్ చేయటం అంటే..ఓహ్..ఆ ఫీలింగే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా?. ఇప్పుడు మాల్దీవుల్లో అలాంటి హోటల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సముద్రమట్టానికి 16 అడుగుల కింద ఈ హోటల్ నిర్మించారు. ఈ హోటల్ లో కూర్చుని భోజనం చేస్తూ 180 డిగ్రీల పనోరమిక్ వ్యూతో సముద్రంలోని పరిస్థితులను గమనించవచ్చు.
ఈ హోటల్ ఖచ్చితంగా పర్యాటకులకు ఓ ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుంది అనటంలో ఎలాంటి సందేహాం లేదు. ఈ హోటల్ లో మాల్దీవులకు చెందిన వంటకాలతో పాటు అంతర్జాతీయ వంటకాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. సముద్రంలో నిర్మించిన ఈ హోటల్ బరువు 75 టన్నులు. ఈ హోటల్ ను సింగపూర్ లో నిర్మించి..ఓడలో తీసుకెళ్ళి మాల్దీవుల్లో ఏర్పాటు చేశారు.
Next Story