టీటీడీ జెఈవో శ్రీనివాసరాజు బదిలీ

ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జెఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఆయన్ను జీఏడీకి అటాచ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ జెఈవోగా శ్రీనివాసరాజు ఎనిమిదేళ్ళకు పైగా పనిచేసి ఓ కొత్త రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వాలు మారినా ఆయన మాత్రం అక్కడ జెఈవోగా కొనసాగుతూనే వచ్చారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ గా ఉన్న బసంత్ కుమార్ కు టీటీడీ జెఈవో అదనపు బాధ్యతలు అప్పగించారు.
సత్వరమే ఈ బాధ్యతలు చేపట్టాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాసరాజు టీటీడీ జెఈవోగా కొనసాగేందుకు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు...ఏకంగా కొంత మంది న్యాయమూర్తులతో కూడా సిఫారసు చేయించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఎట్టలకే శ్రీనివాసరాజు సర్కారు తాజా ఆదేశాలతో కొండ దిగినట్లు అయింది.