Telugu Gateway
Andhra Pradesh

టీటీడీ ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై కలకలం

టీటీడీ ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై కలకలం
X

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లో ఏ నిర్ణయం అయినా బోర్డు తీసుకోవాలి. అప్పుడే చట్టబద్దత ఉంటుంది. కానీ ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు టీటీడీలో కలకలం రేపుతున్నాయి.గత కొన్ని రోజులుగా ఆయన ఎల్1, ఎల్2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. అసలు బోర్డు లేకుండా ఛైర్మన్ ఏకపక్షంగా అత్యంత కీలకమైన నిర్ణయం నిర్ణయం ఎలా తీసుకుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు. సహజంగా ఎవరైనా మరింత పారదర్శక విధానాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి మాత్రం ఎప్పుడో 2012 లో అమల్లో ఉన్న పద్దతి పాటించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఒకప్పుడు ఉదయంతోపాటు..సాయంత్రం కూడా బ్రేక్ దర్శనాలు ఉండేవి. భక్తుల రద్దీ పెరగటంతో సాయంత్రం బ్రేక్ లను తొలగించారు. మరింత పకడ్భందీగా..ప్రస్తుతం ఉన్న దాని కంటే కొత్త సిస్టమ్ ను అమలు చేస్తే ఇబ్బంది ఉండదని..కానీ ముందు నుంచి వెనక్కి వెళ్లటం ఏమిటనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో పాటు అమరావతిలో టీటీడీ ఛైర్మన్ కోసం కార్యాలయం ఏర్పాటు విషయం కూడా దుమారం రేపుతోంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా లేని ఈ కొత్త వ్యవస్థ ఇఫ్పుడెందుకు వస్తుందనే అనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బోర్డు సభ్యులకు కొంత కోటా కింద సిఫారసు లేఖలు ఇచ్చే వెసులుబాటు ఉండేది. పార్టీ కార్యకర్తలు..తెలిసిన వాళ్ళకు బోర్డు సభ్యులు ఈ లేఖలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో ఇవి దుర్వినియోగం అయిన సంగతి కూడా వాస్తవమే. అయితే సిఫారసు లేఖలకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేస్తే కొత్తగా టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన వాళ్ళ సొంత దర్శనాలకు ఆ పదవి పనికొస్తుంది తప్ప..ఇతరులకు ధర్శనాలు ఇప్పించే వెసులుబాటు ఉండదు కదా? అన్న చర్చ సాగుతోంది. ఛైర్మన్ తో పాటు కనీసం ముగ్గురు, నలుగురు సభ్యులతో కూడిన బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని..కానీ ఛైర్మన్ ఒక్కరే ఏకపక్షంగా ఎల్ 1, ఎల్2 రద్దు, అమరావతిలో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకోవటం ఏ మాత్రం సరికాదని చెబుతున్నారు.

Next Story
Share it