Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీలో సీట్ల పంచాయతీ

అసెంబ్లీలో సీట్ల పంచాయతీ
X

వెరైటీగా ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు సీట్ల పంచాయతీ సాగింది. సభలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరులు ఒకరి సీట్లలో ఒకరు కూర్చోవటంతో వివాదం మొదలైంది. వైసీపీ నేతలు ఈ అంశాన్ని ఈ లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఉప నాయకులకు ముందు సీటు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితిని చెక్ చేసి తన నిర్ణయం చెబుతానన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదని, పూర్తిగా రూల్స్ ప్రకారమే కేటాయించడం జరిగిందని చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షం పక్క వరుసలోనే కూర్చునేవారని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడే కూర్చోవడం వల్ల ఆ సీటుపై కొంచెం వ్యామోహం ఉండొచ్చని, అది తప్పేంకాదని చెప్పారు. కానీ రూల్స్ ప్రకారం మీరు(స్పీకర్‌ను ఉద్దేశించి) ఎవరికి కేటాయించిన సీట్లోలో వాళ్లు కూర్చోవాలని శ్రీధర్‌ను ఉద్దేశించే చెప్పారని, శ్రీధర్ వెంటనే గుడ్‌ బాయ్‌లా ఒక మాటకూడా మాట్లాడకుండా తన సీట్లో వెళ్లి కూర్చున్నారని సీఎం జగన్ ప్రశంసించారు.

అంతలోనే చంద్రబాబు రియాక్ట్ అవడం వివాదాస్పదం చేయడానికేనని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రతిదానికి సానుభూతి పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము 67 మంది సభ్యులు ఉండగా అప్పట్లో అధికార టీడీపీ ఎలా వ్యవహరించిందో చంద్రబాబు గుండెలపై చేయి వేసి ప్రశ్నించుకోవాలన్నారు. తాము మాత్రం చాలా ఉదారంగా 23 మంది సభ్యులు ఉన్న టీడీపీకి సమయం ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారని.. ఒక సారి ఓడిపోయి..ఆరు సార్లు గెలిచినా..మధ్యలో ఒక సారి ఓడిపోయి..రెండవ సారి అసెంబ్లీకి వచ్చినా అందరికీ రూల్స్ ఒకటే ఉంటాయని వ్యాఖ్యానించారు జగన్.

Next Story
Share it