ఆగస్టు 15న ‘రణరంగం’ విడుదల
BY Telugu Gateway16 July 2019 9:35 PM IST
X
Telugu Gateway16 July 2019 9:35 PM IST
శర్వానంద్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సందడి చేయటానికి రెడీ అయ్యారు. శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని నటించిన ‘రణరంగం’ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'గ్యాంగ్ స్టర్' గా శర్వానంద్ కన్పించనున్నారు. ఆ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Next Story