Telugu Gateway
Cinema

‘ఏ’ సర్టిఫికెట్ చూపిస్తానంటున్న రకుల్

‘ఏ’ సర్టిఫికెట్ చూపిస్తానంటున్న రకుల్
X

‘ఇప్పటివరకూ యూ సర్టిఫికెట్ కు ప్రయత్నించాను. ఇఫ్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ చూపిస్తాను. ’ ఇదీ మన్మథుడు2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పే డైలాగ్. ఈ సినిమాలో రకుల్ అవంతికగా నటిస్తోంది . ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఆసక్తికర సన్నివేశాలతో మన్మథుడు2 చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. అవంతిక ఆ పేరే ఎంత వినసొంపుగా ఉంది..అంతే పద్దతి కల్ల అమ్మాయి అంటూ లక్ష్మీ రకుల్ ప్రీత్ సింగ్ ను పొగుడుతున్న సన్నివేశాలతో ఇది ప్రారంభం అవుతుంది.

ఆ అమ్మాయి చల్లటి గాలి లాంటిది అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్ చెప్పగానే..నాగార్జున ఓ యాక్షన్ తో బొంగేమి కాదు అంటూ రిటార్డ్ ఇస్తాడు. రెండు సంవత్సరాలుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నాగార్జున చెపితే ఈ వయస్సులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు అంటూ రకుల్ పడి పడి నవ్వుతూ డైలాగ్ చెబుతోంది. మొత్తానికి ఈ అవంతికి పరిచయ వీడియో ఆకట్టుకునేలా ఉంది. మన్ముథుడు 2 సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=FJH_d668y1g&fbclid=IwAR1JmQJXJh780N4ZtzwLKl0phYETdsJcNlgu51KI-mQAGUVUMQY0S8LUQkg

Next Story
Share it