Telugu Gateway
Cinema

ప్రభాస్ రెమ్యునరేషన్ వంద కోట్లా?

ప్రభాస్ రెమ్యునరేషన్ వంద కోట్లా?
X

ప్రభాస్ ఇప్పటివరకూ ఏ టాలీవుడ్ హీరో తీసుకోని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారా?. సాహోతో ఆయన ఈ రికార్డు అందుకోబోతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ధృవపడని వార్తల ప్రకారం ‘సాహో’ సినిమా కు ఆయన రెమ్యునరేషన్ వంద కోట్ల రూపాయల వరకూ ఉందని టాలీవుడ్ టాక్. బాహుబలి సినిమా రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ కావటంతోపాటు...కలెక్షన్లు కూడా రికార్డులు బద్దలు కొట్టాయి. దీని తర్వాత ప్రభాస్ నటించిన తొలి సినిమా ఇదే కావటంతో దీనిపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. వంద కోట్ల రెమ్యునరేషన్ వార్త నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల సరసన ప్రభాస్‌ చేరనున్నాడు. అదే సమయంలో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల కన్నా ప్రభాస్‌ రెమ్యూనరేషనే ఎక్కువ అవుతుంది. సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 15నే విడుదల కావాల్సి ఉన్నా..పలు కారణాల వల్ల వాయిదా పడింది.

Next Story
Share it