Top
Telugu Gateway

కర్ణాటక సర్కారుకు మరో షాక్

కర్ణాటక సర్కారుకు మరో షాక్
X

పతనం అంచున వేలాడుతున్న కర్ణాటక సర్కారుకు మరో షాక్. తాజాగా మరో ఎమ్మెల్యే కుమారస్వామి సర్కారుకు తమ మద్దతు లేదని ప్రకటించారు. గతంలో కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ప్రస్తుతం యూటర్న్‌ తీసుకున్నారు. సోమవారం జరిగే విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తనను బీఎస్పీ చీఫ్‌ మాయావతి కోరారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్‌ మహేష్‌ వెల్లడించారు.

ఇప్పుడు తాను బీఎస్పీ హైకమాండ్‌ ఆదేశాలకు అనుగుణంగా సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని, తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. సంకీర్ణ నేతలు చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అధికార మార్పిడి ఖాయమని ఆశల్లో ఉన్న బీజేపీ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలకు పదునుపెడుతోంది. సోమవారంతో అయినా ఈ రాజకీయ క్లైమాకస్ కు ఎండ్ పడుతుందో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it