Telugu Gateway
Cinema

‘ఓ బేబీ’ కలెక్షన్లు అదుర్స్

‘ఓ బేబీ’ కలెక్షన్లు అదుర్స్
X

సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. అంతే కాదు..ఇప్పుడు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తోంది. ఈ సినిమా తొలి వారాంతంలో ఏకంగా 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళను రాబట్టింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సమంత కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బేబీపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అమెరికాలో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. తొలి మూడు రోజుల్లోనే అమెరికాలో ఐదు లక్షల డాలర్లు వసూలు చేసింది.

Next Story
Share it