Telugu Gateway
Cinema

నిధి అగర్వాల్ కుషీకుషీ

నిధి అగర్వాల్ కుషీకుషీ
X

నిధి అగర్వాల్. ఈ మధ్య కాలంలో తెలుగులో కాస్త జోరు పెంచిన భామ. తాజాగా ఆమె నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలైంది. ఇందులో ఈ భామ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మెహమాటపడలేదు. అంతే కాదు ..నేను యాక్షన్ కూడా చేశాను అని చెబుతోంది. అంతే కాదు..ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయిందని..మాస్ పవర్ ఏంటో ఈ సినిమాతో తాను తెలుసుకున్నానని చెప్పింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ మన చేతుల్లో ఉండవు. స్క్రిప్ట్‌ బావుంటుంది.

ఈ ఐడియా వర్కవుట్‌ అవుతుందనే నమ్మకంతో సినిమాలు చేస్తాం. ఫ్రైడే టు ఫ్రైడే సక్సెస్‌ని నేను నమ్మను. సినిమా రిజల్ట్‌ ను ఎప్పుడూ నేను హార్ట్‌ కి తీసుకోను. యాక్టింగ్‌ ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేస్తాను అని తేల్చిచెప్పింది ఈ భామ. గ్లామర్‌ సీన్స్‌ ఎవరితో తీస్తున్నారు.. ఏ దర్శకుడు తీస్తున్నారు అన్నది ముఖ్యం. స్క్రీన్‌ మీద ఎలా ఉంటుందన్నది ముఖ్యం. పూరీ నన్ను బాగా చూపించారు. నిన్న మా పేరెంట్స్‌ సినిమా చూసి బావున్నావు అన్నారు.

Next Story
Share it