Telugu Gateway
Politics

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ లే ట్విస్ట్ లు
X

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కుమారస్వామి సర్కారు కొనసాగుతుందా?. కొత్తగా బిజెపి సర్కారు ఏర్పాటు చేస్తుందా? ఈ సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..దీనిపై స్పీకర్ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ లోపు సంకీర్ణ సర్కారుకు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నారు. కానీ అనూహ్యంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు జెడీఎస్ కు చెందిన మంత్రులు అందరూ రాజీనామాలు చేశారు. అయితే నిజంగా వాళ్ళంతా మంత్రి పదవుల కోసం బెదిరించారా?. లేక ఇదంతా బిజెపి ప్లాన్ లో భాగమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా కుమారస్వామి మాత్రం ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని చెబుతున్నారు.

కాంగ్రెస్ నేతలు కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ చేపడతామని సీఎం కుమారస్వామి తెలిపారు. కర్ణాటకలో సంక్షోభం ఎదుర్కొంటున్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సమస్యలను అధిగమించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలకు పదునుపెట్టింది.కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం కుమారస్వామి ప్రకటించి రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేరువయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్‌ చేయడం ద్వారా వారు బీజేపీకి దగ్గరకాకుండా నిలువరించాలని సంకీర్ణ సర్కార్‌ యోచిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్‌ 35 మంది పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.

Next Story
Share it