Telugu Gateway
Politics

నన్నెందుకు సస్పెండ్ చేశారో

నన్నెందుకు సస్పెండ్ చేశారో
X

‘నేను ముందే చెప్పాను. కుమారస్వామి సర్కారుకు అనుకూలంగా ఓటు వేయటం లేదని. అయినా సరే నన్నెందుకు సస్పెండ్ చేశారో తెలియదు.’ ఇదీ బిఎస్పీ అధినేత్రి మాయవతి చేతిలో సస్పెన్షన్ వేటుకు గురైన కర్ణాటక లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎన్. మహేష్ స్పందన. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేశ్‌ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్‌ చేశారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్‌ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్విట్‌ చేశారు.

2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్‌లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్‌ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్‌కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

Next Story
Share it