Telugu Gateway
Cinema

మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా

మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా
X

ఒక్క సినిమా. ఒకే ఒక్క సినిమా సందీప్ రెడ్డి రేంజ్ ను మార్చేసింది. అదే తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్. ప్రస్తుతం సందీప్ రెడ్డి సెన్సేషనల్ డైరక్టర్ గా మారిపోయారు. అంతటి సెన్సేషనల్ డైరక్టర్ కొత్త సినిమా అంటే సహజంగా టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ ఉండటం సహజం. ఇప్పుడు అలాంటిదే జరుగుతోంది. సందీప్ రెడ్డి, మహేష్ బాబుల కాంబినేషన్ లో త్వరలో ఓ కొత్త సినిమా రానుందని వార్త.

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి హిట్ ను ఎంజాయ్ చేస్తూ..మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవరు’ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించినట్లు చెబుతున్నారు.

Next Story
Share it