రియల్ ‘బిజినెస్ మ్యాన్’గా మహేష్ బాబు
BY Telugu Gateway29 July 2019 6:01 PM IST

X
Telugu Gateway29 July 2019 6:01 PM IST
బహుశా టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబుకు ఉన్నన్ని వ్యాపారాలు మరెవరికీ లేవనే చెప్పొచ్చు. ఇప్పటికే మల్టీఫ్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించిన ఈ సూపర్ స్టార్..మరో వైపు సొంత నిర్మాణ సంస్థతో సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆగస్టు 7 నుంచే ఇది ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.
గతంలో బిజినెస్ మెన్ సినిమాలో హీరోగా చేసిన ఈ స్టార్ ఇప్పుడు రియల్ బిజినెస్ మ్యాన్ గా మారిపోయారు. హంబుల్కో అనే బ్రాండెడ్ దుస్తులను ఆగస్టు 7వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తన అభిమానులకు తెలిపాడు. ఇప్పటికే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండెడ్ దుస్తుల బిజినెస్ మొదలెట్టి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ కూడా ఈ రంగంలో దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు.
Next Story



