సంపూర్ణేష్ బాబు ‘వరల్డ్ రికార్డు’!
టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసం సంపూర్ణేష్ బాబు చేశారా?. ఒక్క టాలీవుడ్ లోనే కాదు సుమా..ఏకంగా ఇది ప్రపంచ రికార్డు అని చిత్ర యూనిట్ చెబుతోంది. అది ఎలాగంటే ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరో సంపూర్ణేష్ బాబు ఏకంగా ఎలాంటి బ్రేక్ లేకుండా 3.30 నిమిషాల డైలాగ్ ను సింగిల్ టేక్ లో షూట్ చేసినట్లు చెబుతున్నారు. పైగా ఇదేదో స్టూడియోలో జరిగింది కాదు. బహిరంగంగా ఓ ప్రదేశంలో చేసిన షూటింగ్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ ‘ఆంఢ్రాయుడు’గా ఈ ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ప్రపంచ రికార్డుగా చెబుతున్న 3.30 నిమిషాల వీడియోను విడుదల చేసింది. నిజంగా ఇందులో సంపూర్ణేష్ బాబు డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
ఎలాంటి తడబాబు..తొట్రుపాటు లేకుండా ఏకబిగిన డైలాగ్ ను పూర్తి చేస్తాడు. హృదయ కాలేయంతో బర్నింగ్ స్టార్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరిమట్ట చిత్రంతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్దమయ్యాడు. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ సినిమా.. పలు అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంపూ ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. రూపక్ రోనాల్డ్‌సోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.youtube.com/watch?time_continue=1&v=js1TBBQnF-A