Telugu Gateway
Andhra Pradesh

కియా మోటార్స్ ఏర్పాటుకు వైఎస్ హయాంలో బీజం

కియా మోటార్స్ ఏర్పాటుకు వైఎస్ హయాంలో బీజం
X

ఏపీలోని అనంతపురంలో ఏర్పాటైన కియా మోటార్స్ యూనిట్ విషయంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో కియా మోటార్స్ ఏర్పాటుకు వైఎస్ హయాంలోనే బీజం పడిందని తెలిపారు. 2007లో హ్యూండయ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు సమయంలోనే ఏపీలో ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా వైఎస్ రాజశేఖరరెడ్డి హన్ వూ పార్క్ ను కోరారని..ప్రస్తుతం ఆయనే కియా మోటార్స్ సీఈవో గా ఉన్నారని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కియా మోటార్స్ సీఈవో రాసిన లేఖను బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సభలో చదివి విన్పించారు. ఇందులో ఆయన స్పష్టంగా చెప్పారని..వైఎస్ హయాంలోనే ఆటోమొబైల్ యూనిట్ పెట్టాల్సిందిగా వైఎస్ కోరారని తెలిపారు. కానీ చంద్రబాబు మాట్లాడితే..ఏది అడిగినా కియా..కియా..కియా అంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు విదేశీ పర్యటనలపై జరిగిన చర్చ సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తిరగన్ని విదేశీ పర్యటనలు చంద్రబాబు చేశారని..కానీ ఆ ఫలితాలు మాత్రం రాష్ట్రంలో ప్రతిఫలించలేదని మంత్రి బుగ్గన వ్యాఖ్యాంచారు. ఏపీ కంటే ఐటి రంగంలో ఎంతో ముందున్న కర్ణాటక, తమిళనాడులు కూడా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోవని..కానీ చంద్రబాబు చివరకు కంప్యూటర్ కూడా తానే కనిపెట్టినట్లు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓ అప్లికేషన్ లో ప్రశ్నలకు సమాధానాలు చెపితే ఇస్తారని..ఇది పనితీరును చూసి ఇచ్చే నివేదిక కాదని బుగ్గన వ్యాఖ్యానించారు.

Next Story
Share it