‘ఇస్మార్ట్’ వసూళ్ళు
BY Telugu Gateway21 July 2019 10:51 AM IST

X
Telugu Gateway21 July 2019 10:51 AM IST
ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూళ్ళు కూడా అంతే ‘ఇస్మార్ట్’గా ఉన్నాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. మూడు రోజులు..36 కోట్ల గ్రాస్ సాధించిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అతి పెద్ద మాస్ సినిమా ఇదే. హీరో రామ్ కూడా తన ఎనర్జీ లెవల్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్ళి మాస్ పాత్రలకు తాను పక్కాగా సరిపోతానని నిరూపించుకున్నాడు. అదే సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కు కూడా చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ ఓ కమర్షియల్ హిట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పెట్టి..హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ ను కూడా పూరీ జగన్నాథ్ పూర్తి స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేయించాడు. ఆదివారం నాడు కూడా కలెక్షన్లు ఆశాజనంగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో తొలి వారాంతానికే ఇస్మార్ట్ శంకర్ 50 కోట్ల మార్క్ ను దాటుతుందని అంచనా వేస్తున్నారు.
Next Story



