Telugu Gateway
Andhra Pradesh

జగన్ నివాసం..క్యాంప్ ఆఫీస్ పనుల కోసం 3.63 కోట్లు

జగన్ నివాసం..క్యాంప్ ఆఫీస్ పనుల కోసం 3.63 కోట్లు
X

ఆంధ్ర్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ లో వివిధ రకాల పనులు చేపట్టేందుకు సర్కారు 3.63 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు శుక్రవారం నాడు జీవో 146 జారీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ కు ట్రాన్స్ ఫార్మర్, లైటింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హెచ్ టి ఏర్పాట్ల కోసం 97 లక్షల రూపాయలు, సీసీటీవీ, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాట్ల కోసం 1.25 కోట్లతో కల్పించనున్నారు.

విఆర్ వీ సౌకర్యంతో అదనపు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కోసం 80 లక్షల రూపాయలు, 320 కెవీఎ డిజి సెట్ కోసం 39 లక్షల రూపాయలు, సీఎం క్యాంప్ ఆఫీస్ వెలుపల లైటింగ్ కోసం 11.50 లక్షలు, హైదరాబాద్ సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద ఉన్న యూపీఎస్ సిస్టమ్ తీసేసి..దాన్ని తాడేపల్లి సీఎం నివాసంలో అమర్చేందుకు 11 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్ధిక శాఖ అనుమతితో ఈ ఉత్తర్వులు జారీ చేశారు.320 కెవీఎ డిజి సెట్ ఖరీదు ఆన్ లైన్ లో 16 లక్షల రూపాయలు చూపిస్తుంటే...ఆర్ అండ్ బి అధికారులు మాత్రం దీని ఖరీదు ఏకంగా 39 లక్షల రూపాయలుగా అంచనా వేయటం విశేషం.

Next Story
Share it