Telugu Gateway
Andhra Pradesh

ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి

ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కు కీలక పదవి ఇచ్చారు. అత్యంత కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఆర్‌ఏ) చైర్మన్‌గా ఆయన్ను నియమించారు ఈ మేరకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థిపై ఓటమిపాలైన విషయం తెలిసిందే. ద్రోణంరాజు శ్రీనివాస్‌ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Next Story
Share it