Telugu Gateway
Cinema

‘దొరసాని’ మూవీ రివ్యూ

‘దొరసాని’ మూవీ రివ్యూ
X

ఓ పేదింటి అబ్బాయి..పెద్దింటి అమ్మాయి. వాళ్ళిద్దరి ప్రేమ. అందులో ఎదురయ్యే సమస్యలు. ఇలాంటి స్టోరీలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో గడీలు..ఈ గడీల్లో ఉంటే దొరసానులు ఎలా ఉంటారు?. ఓ కూలి పనిచేసుకుని వ్యక్తి కొడుకు ఆ గడీలోని దొర బిడ్డను ప్రేమిస్తే ఎలా ఉంటుంది?. ఆ ప్రేమకు ఎదురయ్యే పర్యవసనాలు ఏంటి? అన్నది కళ్లకు కట్టినట్లు చూపించే సినిమానే ‘దొరసాని’. సినిమా అంతా ఓ గడి..ఆ గడిలో దొరసాని నివాసం ఉంటే గది కిటికీకి దూరం నిలుచుని ఉంటే ఆ ప్రేమికుడు. సినిమా అంతా పదే పదే అవే సీన్లు రిపిట్ అవుతున్నా ఎక్కడా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. మధ్యమధ్యలో హీరో తన స్నేహితులతో చేసే హంగామా..అత్యంత సహజమైన నటన సినిమాలో హైలెట్. గ్రామీణ నేపథ్యం తెలిసిన..అనుభవించిన వారికి మాత్రమే దొరసాని సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. దర్శకుడు కె వి ఆర్ మహేంద్ర సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించారనే చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ చాలా కూల్ గా నడిపోతుంది. సెకండాఫ్ లో మాత్రం హీరోకు ఎదురయ్యే కష్టాలు..సంఘర్షణతో ఒకింత స్లోగా నడిచినట్లు కన్పిస్తుంది. హీరో ఆనంద్ పేదింటి కుర్రాడిగా...అత్యంత సహజంగా నటించారు. ఇక శివాత్మిక ఈ సినిమాకు ఓ అసెట్ అని చెప్పొచ్చు.

తొలి సినిమానే అయినా ఆమె హావభావాలు, నటన సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక దొరసాని సినిమాలో గడిలో దొరగా నటించిన వినయ్ వర్మ పాత్ర సినిమాలో హైలెట్. ఆయన నటన అత్యంత సహజంగా..నిజమైన దొర అలాగే ఉంటారా? అనే తరహాలో ఆయన పాత్రను దర్శకుడు తెరకెక్కించారు. గడీల సమయంలో మావోయిస్టుల ప్రభావం ఉండటంతో సినిమా కథలో ఆ లైన్ ను కూడా అక్కడక్కడ చూపించి అత్యంత సహజంగా సినిమాను నడిపించాడు దర్శకుడు. హీరో..హీరోయిన్లను కారులోనే కాల్చేసి..కారుకు నిప్పంచటం ద్వారా దొర కొడుకు కూడా ప్రేమ విషయంలో పెద్దల కుటుంబాలు ఎలా వ్యవహరిస్తాయో చూపించారు. ‘మీది ప్రేమ కాదు. ఆకర్షణ. కాదు మాది ప్రేమ. ప్రేమ అంటే...ఏమో ప్రేమ అంటే ప్రేమే.’ ‘మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. సినిమాలో పాటలు కూడా అత్యంత సహజంగా..ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫైనల్ గా ‘దొరసాని’ సినిమా మట్టి వాసనల సహజత్వంతో కూడిన సినిమా.

రేటింగ్.3/5

Next Story
Share it