Telugu Gateway
Cinema

‘దొరసాని’ ట్రైలర్ విడుదల

‘దొరసాని’ ట్రైలర్ విడుదల
X

ప్రేమ కథలు ఎన్నిసార్లు చెప్పినా ప్రతి దాంట్లో ఓ కొత్తదనం కన్పిస్తూనే ఉంటుంది. ప్రేమ ఎన్నో సినిమాలకు ఓ ముడిసరుకు. ఒక్కో దర్శకుడు ఒక్కో తీరుగా ప్రేమకథను చెబుతాడు. ఇప్పుడు ‘దొరసాని’ రూపంలో ఓ ప్రేమకథ జూలై12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్దింటి అమ్మాయి..పేదింటి కుర్రాడు. మరి ఈ ప్రేమ కథలో కొత్తదనం చూడాలంటే జూలై12 వరకూ ఆగాల్సిందే. అయితే చిత్ర యూనిట్ సోమవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది.

దొరసాని సినిమాలో హరోయిన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటించగా..హీరోగా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ నటించారు. ఈ సినిమాలో హీరోకు విజయ్ దేవరకొండ వాయిస్ ఇచ్చినట్లు ట్రైలర్ లో తేలిపోయింది. కె వి ఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

https://www.youtube.com/watch?v=5Xpl-Vm237o&fbclid=IwAR1B5CTwXoY-5NtH3d5vrdtMahBVEV1Cd5rw4sbxTmCZShI_tUVE3psRcNk

Next Story
Share it