టీటీడీ జెఈవోగా ధర్మారెడ్డి నియామకం
BY Telugu Gateway10 July 2019 3:43 PM GMT
X
Telugu Gateway10 July 2019 3:43 PM GMT
అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జెఈవోగా ఏ వీ ధర్మారెడ్డిని సర్కారు నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎనిమిదేళ్లకు పైగా ఇదే పోస్టులో కొనసాగిన శ్రీనివాసరాజును సర్కారు ఈ మధ్యే బదిలీ చేసింది. ఆ పోస్టులో ఇప్పుడు ధర్మారెడ్డిని నియమించారు.
కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన్ను డిప్యుటేషన్ పై తీసుకొచ్చి మరీ ఈ పదవి అప్పగించారు. వైఎస్ హయాంలో కూడా ఆయన టీటీడీ జెఈవోగా పనిచేశారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అదే పోస్టులో ఆయన్ను నియమించటం విశేషం.
Next Story