డియర్ కామ్రెడ్ కు యు/ఏ సర్టిఫికేట్
BY Telugu Gateway20 July 2019 12:23 PM IST

X
Telugu Gateway20 July 2019 12:23 PM IST
వాళ్లిద్దరి కాంబినేషన్ అంటేనే క్రేజ్. సో..మళ్ళీ అదే కాంబినేషన్ రిపిట్ అవుతుండటంతో అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘డియర్ కామ్రెడ్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. డియర్ కామ్రెడ్ జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు రానున్న విషయం తెలిసిందే.
మరి విజయ్, రష్మిక మ్యాజిక్ మరోసారి రిపిట్ అవుతుందా?. అంటే వేచిచూడాల్సిందే. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Next Story



